Sun Feb 01 2026 21:54:28 GMT+0000 (Coordinated Universal Time)
ద్వారంపూడి ముందు నువ్వు గెలువు
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వారంపూడికి అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోట ీచేసినా తాము ఓడిస్తామని సవాల్ విసిరిన ద్వారంపూడికి నాదెండ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంత సీన్ నీకు లేదని గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
వ్యక్తిగత విమర్శలు చేస్తే....
ఈసారి కాకినాడలో జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ చేతిలో ఓటమి నుంచి ద్వారంపూడి తనను తాను కాపాడుకోవాలని నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. ద్వారంపూడి ఇప్పటికైనా పవన్ పై వ్యక్తిగత విమర్శలను వదిలిపెట్టి కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నాదెండ్ల మనోహర్ కోరారు. తమ పార్టీ నాయకత్వాన్ని చులకనగా మాట్లాడితే సహించేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
Next Story

