Sun Mar 08 2026 05:30:50 GMT+0530 (India Standard Time)
సీఎం సొంత జిల్లాలోనే అధికంగా ఆత్మహత్యలు
కడప జిల్లాలో ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు

కడప జిల్లాలో ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జగన్ కు అంత భరోసా ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలన్నారు. సమస్యల పట్ల స్పందించే మనస్తత్వంలేని నేత జగన్ అని అన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబం మొత్తం రైతులను ఆదుకునేందుకు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ఎంతమందికి ఏడు లక్షల పరిహారం ఇచ్చారో చెప్పాలని వైఎస్ జగన్ ను నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ఏమైంది?
నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలను ఈ ప్రభుత్వం కల్పంచలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలని నిలదీశారు. మూడేళ్ల నుంచి కేవలం కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టారన్నారు. తాము సమాచార హక్కు చట్టం ప్రకారమే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలను తెప్పించుకున్నామని తెలిపారు. జగన్ సొంత జిల్లాలోనే కౌలు రైతులకు పవన్ ఆర్థికసాయం అందిస్తారని, వైసీపీ ప్రజాప్రతినిధులందరూ వచ్చి చూడాలని ఆయన కోరారు.
Next Story

