Tue Jan 20 2026 15:06:08 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్‌లోనే పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రద్దయింది. పార్టీ పెద్దల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రద్దయింది. పార్టీ పెద్దల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. నిజానికి నిన్ననే ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. పొత్తులపై చర్చలు జరపాల్సి ఉంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలసి పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించగలిగారు.
ఢిల్లీకి వెళ్లి...
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను కలసి వచ్చారు. ఆ తర్వాత పొత్తు చర్చలు ముందుకు సాగడం లేదు. పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని, బయలుదేరుతారని నిన్నంతా ప్రచారం జరిగింది. కానీ బీజేపీ నేతల అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.
Next Story

