Wed Mar 25 2026 18:01:18 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలోనే పవన్.. ఏం జరుగుతుంది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం పవన్, నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏపీ బీజేపీ ఇన్ఛార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గంటన్నర పాటు సాగింది. ఏపీలో రాష్ట్రంలో బీజేపీతో కలసి ప్రయాణించడం, ఏ ఏ అంశాలపై కలసి ఉద్యమించాలన్న అంశంపై చర్చించారని తెలిసింది.
ఈరోజు కూడా...
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మురళీధరన్ తో చర్చించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ఇంకా పలువురిని కలవాల్సి ఉందని వెల్లడించారు. అందరినీ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉండి పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాను పవన్ కలిసే అవకాశముంది. పవన్ కల్యాణ్ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
Next Story

