Wed Jul 16 2025 23:09:39 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి నాలుగో విడత పవన్ వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. నాల్గో విడత యాత్రకు పవన్ సిద్ధమవుతున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. నాల్గో విడత యాత్రకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పవన్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో వారాహి యాత్రను పూర్తి చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వారాహి యాత్ర మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుని మంగళిగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
ఐదు రోజుల పాటు...
కృష్ణా జిల్లాలో మొత్తం ఐదు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ వారాహి యాత్రకు ఈసారి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలపడంతో అధిక సంఖ్యలో కార్యకర్తలు యాత్రకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న తొలి యాత్ర కావడంతో పవన్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవనిగడ్డలో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.
Next Story