Thu Mar 19 2026 07:05:54 GMT+0530 (India Standard Time)
Breaking : వారాహి వాహనానికి అనుమతి నో షాకిచ్చిన పోలీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి పోలీసులు అనుమతివ్వలేదు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి పోలీసులు అనుమతివ్వలేదు. చేబ్రోలులో ఆయన వారాహి వాహనాన్ని నిలిపేశారు. సరైన అనుమతులు తీసుకోకపోవడం వల్లనే వారాహి వాహనాన్ని రోడ్డు మీదకు అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. పిఠాపురంలో వారాహి వాహనానికి పూజలు చేయాల్సి ఉంది. అనంతరం ఆ వాహనంపై నుంచే ఆయన ప్రసంగించాల్సి ఉంది.
నిర్ణీత సమయంలో...
కానీ అనుమతులు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్లనే అనుమతులు ఇవ్వలేదని పోలీసులు వారాహి వాహనాన్ని నిలిపివేశారు. దీంతో పూజలు కూడా చేయలేదు. పిఠాపురంలో నాలుగు రోజుల పాటు పర్యటించేందుకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన విషయాలపై చర్చించారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు చేయాలని భావించిన పవన్ కల్యాణ్ కు దానికి అనుమతి నిరాకరించి షాక్ ఇచ్చారు.
Next Story

