Fri Mar 27 2026 05:48:51 GMT+0530 (India Standard Time)
ఈయన కత్తి యుద్ధం ఎవరిపైనో... పవన్ పై సెటైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి ఆర్కే రోజా మండి పడ్డారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి ఆర్కే రోజా మండి పడ్డారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ వాహనం వారాహి కాదని, అది నారాహి అని రోజా సెటైర్ వేశారు. ఎవరికో ఊడిగం చేయడానికి పవన్ బస్సు యాత్ర మొదలు పెడుతున్నాడని రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పవన్ యుద్ధం అంటూ ట్వీట్ చేయడం నవ్వు తెప్పిస్తుందని రోజా ఎద్దేవా చేశారు.
నారా సైన్యంలో చేరి...
నారాహి సైన్యంలో చేరి ఆయన యుద్ధం చేయాలనుకుంటున్నారని రోజా అన్నారు. పవన్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, జనం కూడా ఆయన చేష్టలు చూసి నవ్వుకుంటున్నారని రోజా అన్నారు. కత్తులతో ఎవరిపైన యుద్ధం చేస్తాడో ఆయనకే తెలియదని అన్నారు. శ్వాస తీసుకోవాలా? వద్దా అన్నది చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని, ఎందుకంటే ఆయన బతికేది హైదరాబాద్ లో నన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రోజా అన్నారు.
Next Story

