Thu Mar 19 2026 05:29:25 GMT+0530 (India Standard Time)
పవన్ పశ్చిమ టూర్ వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి లో పాల్గొనాల్సిన సభలు వాయిదా పడ్డాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి లో పాల్గొనాల్సిన సభలు వాయిదా పడ్డాయి. ఆయన ఈరోజు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలలో పాల్గొన్నాల్సి ఉంది. అయితే ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య వల్ల పర్యటన వాయిదా పడింది.
సాంకేతిక సమస్య...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఆయన హెలికాప్టర్ లో కూర్చున్నాక ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం సభకు రావాల్సి ఉండగా అవాంతరం ఏర్పడింది. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో మరో రోజు సభలు జరపాలని పార్టీ నిర్ణయించింది.
Next Story

