Thu Mar 19 2026 01:55:56 GMT+0530 (India Standard Time)
బాబు - పవన్ భేటీపై నాదెండ్ల ఏమన్నారంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భేటీపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భేటీపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ నిన్న సమావేశంలో చంద్రబాబుతో కొన్ని కీలక అంశాలపై చర్చించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూసేందుకే పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశారన్నారు. ఆ దిశగానే వారిద్దరి మధ్య చర్చలు జరిగాయని తెలిపారు.
పదవుల కోసం కాదు...
జనసేన పదవుల కోసం వెంపర్లాటడం లేదని, పదవులు పవన్ కు ముఖ్యం కాదని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తారని, భవిష్యత్లో మరినకొన్నిసార్లు సమావేశాలు జరుగుతాయని నాదెండ్ల తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకుని పోయే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Next Story

