Tue Mar 17 2026 02:13:51 GMT+0530 (India Standard Time)
నోవాటెల్ నుంచే అభివాదం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోవాటెల్ లో ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు ఆర్కే బీచ్ కు పోటెత్తారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోవాటెల్ లో ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు ఆర్కే బీచ్ కు పోటెత్తారు. వేల సంఖ్యలో జనం రావడంతో ఆర్కే బీచ్ జనసైనికులతో నిండిపోయింది. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో నోవాటెల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను చూడాలని భావిస్తున్నారు.
అభిమానులను...
అయితే పవన్ మాత్రం హోటల్ బయటకు రాకుండా గది కిటికీ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. పోలీసులు నోవాటెల్ చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ అనుమతి లేకుండా లోపలికి పంపడం లేదు. దీంతో హోటల్ కు వచ్చిన సాధారణ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. జనసైనికుల అరెస్ట్ ల నేపథ్యంలో బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ ను కలిసి చర్చించారు.
Next Story

