Thu Jan 29 2026 18:04:08 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఘన విజయం సాధించారు

జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజార్టీతో పవన్ విజయాన్ని అందుకున్నారు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా.. కూటమి కూడా విజయం సాధించేలా పావులు కదిపారు. అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి.
Next Story

