Thu Mar 19 2026 10:27:28 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతికి పవన్ కల్యాణ్
తిరుపతిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు.

తిరుపతిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం పది గంటల నుంచి పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతిలోని జిఆర్ఆర్ కన్వెన్షన్ హాలులో జనవాణి కార్యక్రమం జరగనుంది.
జనవాణి కార్యక్రమంలో...
ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై వినతులను పవన్ కల్యాణ్ స్వీకరిస్తారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు ఈ జనవాణి కార్యక్రమానికి రావచ్చని జనసేన పార్టీ తెలిపింది. ఇప్పటికే జనవాణి కార్యక్రమాన్ని ఆదివారాల్లో పవన్ కల్యాణ్ విజయవాడలో రెండు దఫాలు, భీమవరంలో ఒకసారి నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story

