Mon Jan 20 2025 10:12:56 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : నేడు రాజమండ్రికి పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రికి రానున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు రానున్నారు. నిన్న విశాఖ జిల్లాలో పర్యటించి అక్కడి పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
పార్టీ నేతలతో...
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుతో వెళుతున్నందున ఓట్ల బదిలీ విషయంపై వారితో చర్చించనున్నారు. ఈ ఎన్నికలు పార్టీకి ఎంత అవసరమో వారికి తెలియజేయనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు, నేతలకు అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చేందుకు జనసేనాని వరసగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
Next Story