Thu Mar 19 2026 03:51:44 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు భీమవరానికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భీమవరంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భీమవరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం పదిగంటలకు భీమవరం చేరుకుంటారు. అక్కడ తొలుత తోట సీతారామలక్ష్మితో భేటీ కానున్నారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలుసుకుని రాజకీయాలపై చర్చిస్తారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా కలుస్తారు. వీరిద్దరితో భేటీ మర్యాదపూర్వకమేనని జనసేన వర్గాలు తెలిపాయి.
పార్టీ నేతలతో...
ఆ తర్వాత పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు, ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ జనసేన బలంగా ఉంది? అభ్యర్థులు బలంగా ఎక్కడ ఉన్నారు? అన్న దానిపై నేతలతో చర్చిస్తారు. అయితే ఈ సమావేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలియజేయకున్నా నేతల నుంచి పవన్ కల్యాణ్ కొంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలిసింది.
Next Story

