Sat Mar 07 2026 18:12:41 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేటి నుంచి పవన్ ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు ఆయన అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లిలో జరిగే రోడ్ షో, బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అనకాపల్లి ఎంపీ, అసెంబ్లీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారాన్ని నిర్వహిస్తారు. వారాహి విజయ యాత్ర ద్వారా ఆయన ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
అస్వస్థతకు గురయి...
ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకోనున్నారు. ఇప్పుడు కోలుకోవడంతో ఆయన తిరిగి యాత్రను ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్ అనకాపల్లి పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలను, పార్టీ అభిమానులను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

