Fri Dec 05 2025 15:41:53 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో బందరుకు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో మచిలీపట్నం చేరుకోనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో మచిలీపట్నం చేరుకోనున్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పవన్ కల్యాణ్‌కు దారిపొడవునా అభిమానులు పెద్దయెత్తున స్వాగతం పలికారు. వారాహి వాహనంపై బయలుదేరిన పవన్ కు భారీ గజమాలతో బందరు రోడ్డు వద్ద స్వాగతం పలికిన అభిమానులు వేలాది మంది కార్యకర్తల కేరింతల మధ్య మచిలీపట్నం బయలుదేరి వెళ్లారు.
భారీ ట్రాఫిక్ జాం...
దీంతో బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి. బందరు రోడ్డులో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను ఏలూరు రోడ్డు నుంచి దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దారి పొడవునా పవన్ కు భారీ స్వాగతం లభించింది. పవన్ వెంట పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ఉన్నారు.
Next Story

