Wed Mar 18 2026 20:03:02 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేటి నుంచి వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పిఠాపురంలో ఆయన యాత్ర మొదలు కానుంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పిఠాపురంలో ఆయన యాత్ర మొదలు కానుంది. ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తొలిరోజు శక్తిపీఠం పురుహూతిక అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వర్మ ఇంటికి వెళ్లి...
అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత టీడీపీ నేత వర్మ ఇంటికి వెళతారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడతారు. అనంతరం సాయంత్రం చేబ్రోలులో వారాహి విజయయాత్ర పేరిట బహిరంగ సభను నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు పవన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Next Story

