Mon Mar 16 2026 01:46:45 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : ఢిల్లీకి పవన్ కల్యాణ్.. సీట్ల సర్దుబాటుపై
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారని చెబుతున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు పై కూడా పవన్ వారితో చర్చించే అవకాశాలున్నాయి.
సీట్లు, ఉమ్మడి ప్రచార సభలు...
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షా తో భేటీ అయి వచ్చిన తర్వాత పవన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మూడు పార్టీలు కలసి ఎన్నికలకు ఎలా వెళ్లాలి? ఉమ్మడి ప్రచార సభలు, సీట్లు, సర్దుబాట్లు వంటి అంశాలపై పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు.
Next Story

