Fri Dec 05 2025 11:36:27 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఇప్పటం గ్రామానికి పవన్
రేపు ఇప్పటం గ్రామానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఇళ్ల కూల్చివేతను స్వయంగా పవన్ పరిశీలించనున్నారు

రేపు ఇప్పటం గ్రామానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఇళ్ల కూల్చివేతను స్వయంగా పవన్ పరిశీలించనున్నారు. ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణకు సంబంధించి కొన్ని ఇళ్లను అధికారులు కూల్చివేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే కూల్చివేతకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఓటు వేయని వారిపై ఈ రకంగా కక్ష తీర్చుకుంటారా? అని ప్రశ్నించారు.
హైకోర్టు స్టే...
ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అండగా నిలబడుతుందన్నారు. కాగా ఇప్పటంలో కూల్చివేతలపై జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైన విచారించిన హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటం గ్రామంలో 70 అడుగుల రోడ్డు ఉన్నప్పటికీ, 120 అడుగుల రోడ్డు విస్తరణ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, తాము వారికి అండగా నిలబడతామని తెలిపారు.
Next Story

