Sun Mar 15 2026 16:16:47 GMT+0530 (India Standard Time)
27న ఇప్పటం గ్రామానికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 27వ తేదీన ఇప్పటం గ్రామానికి రానున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 27వ తేదీన ఇప్పటం గ్రామానికి రానున్నారు. ఆయన మరోసారి గ్రామంలో పర్యటించి ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించనున్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్లకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందివ్వనున్నారు.
ఇంటికి లక్ష...
ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేయడంతో ఇప్పటం గ్రామంలో కొందరి ఇంటి ప్రహరీగోడలను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇళ్లు కోల్పోయిన ప్రతి ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ బాధితులకు లక్ష రూపాయల చెక్కును అందిస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

