Wed Mar 18 2026 20:03:03 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్.. ఉగాది వేడుకలు అక్కడే..ముఖ్యమైన ప్రకటన కూడా
రేపు పిఠాపురానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు

రేపు పిఠాపురానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నియోకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఉగాది పండగను అక్కడే జరుపుకోవాలని నిర్ణయించారు. జనసైనికులు, ప్రజల మధ్య ఉగాది వేడుకలను పవన్ జరుపుకోనున్నారు.
తనను గెలిపిస్తే...
తనను పిఠాపురంలో గెలిపిస్తే ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కల్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా చెబుతున్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే పిఠాపురం అభివృద్ధిని చేసి చూపిస్తానని అంటున్నారు. తాను గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది రేపు ఉగాది నాడు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారు.
Next Story

