Thu Mar 19 2026 13:09:17 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాకు పవన్ కల్యాణ్
నేడు కడప జిల్లాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. కడప జిల్లాలో జరిగే రైతు భరోసా యాత్రలో పాల్గొననున్నారు

నేడు కడప జిల్లాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. కడప జిల్లాలో జరిగే రైతు భరోసా యాత్రలో పాల్గొననున్నారు. కౌలు రైతుల కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పవన్ కల్యాణ్ అందించనున్నారు. అనంతరం సభలో ఆయన పాల్గొంటారు.
సిద్ధవటంలో రచ్చబండ...
కడప జిల్లా సిద్ధవటంలో రచ్చ బండ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుగానే కడప జిల్లాకు చేరుకున్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పరిశీలించారు. కడప జిల్లా నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు ఈ సభకు రానున్నారు.
Next Story

