Sun Feb 01 2026 22:43:56 GMT+0000 (Coordinated Universal Time)
భీమవరానికి పవన్... అందుకే...?
ఈ నెల 17వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం రానున్నారు. జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ఈ నెల 17వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం రానున్నారు. జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రెండు ఆదివారాలు విజయవాడలో పవన్ నిర్మించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
విమర్శలు రావడంతో...
అదే సమయంలో వచ్చే ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని భీమవరంలో నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే ఇటీవల మోదీ పర్యటన సందర్భంగా భీమవరానికి పవన్ కల్యాణ్ రాలేదు. అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. తాను పోటీ చేసిన ప్రాంతానికి రాకపోవడమేంటని ఆయన వ్యతిరేకులు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం భీమవరంలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Next Story

