Wed Mar 18 2026 20:02:47 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : 30న పిఠాపురానికి పవన్.. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారాన్ని నిర్వహించనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తుండటంతో పార్టీ నేతలు అందుకు సంబంధించిన సన్నాహాలను చేస్తున్నారు
మేధావులతో సమావేశం...
పిఠాపురంలో 30న ప్రచారం చేసిన తర్వాత 31న ఉప్పాడ సెంటర్ లో పవన్ వారాహి రధం ద్వారా జరిగే బహిరంగ సభలోె పాల్గొననున్నారు. అనంతరం 1వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో మేధావులతో సమావేశమవుతారు. ఏపీలో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యతను మేధావులు తీసుకోవాలని ఆయన కోరనున్నారు.
Next Story

