Thu Mar 19 2026 10:05:05 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : కొణతాల ఇంటికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. నిన్న ఆయన విశాఖలో పర్యటనకు వచ్చిన సందర్భంగా కొణతాల నివాసానికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. ఇద్దరు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొణతాల రామకృష్ణ చాలా రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల జనసేన పార్టీలో చేరారు.
అనకాపల్లి సీటుపైనేనా?
అయితే ఆయన అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి నాగబాబు పోటీ చేయడానికి రెడీ అవుతుండటంతో కొణతాల రామకృష్ణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో ఈ విషయంపై మాట్లాడేందుకే పవన్ నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలిసింది.
Next Story

