Mon Jan 20 2025 05:55:31 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ పై పవన్ లేటెస్ట్ సెటైర్ ఇదే
వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి జగన్ వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు.. కాదు.. సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తున్నట్లుగా ఏపీలో పరిస్థితి తయారయిందని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఈమేరకు పవన్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.
బైబిల్ సూక్తితో....
రాష్ట్రంలో అక్రమంగా సారా కాస్తున్నారని, మద్యం డిస్టిలరీలన్నీ కూడా వైసీపీ వారివేనని చురకలంటించారు. వీటి ద్వారా వచ్చే అదనపు వేల కట్ల ఆదాయం కూడా వారికేనని, అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు... సత్ప్రవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్ చేశారు.
Next Story