Sat Mar 21 2026 08:31:34 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ పదవిని ముందుగానే లీక్ చేసిన అమిత్ షా.. చిరంజీవి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు ఏ పదవి వస్తుందన్నది మాత్రం ఇంతవరకూ అధికారికంగా క్లారిటీ మాత్రం రాలేదు. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ముందుగానే పవన్ కల్యాణ్ పదవి ఏంటో చెప్పేశారు. అభిమానులు పడుతున్న ఉత్కంఠకు తెరతీశారు.
అమిత్ షా, చిరంజీవి...
అమిత్ షా, చిరంజీవి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన వెంటనే ఎక్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు అభినందనలు అంటూ తెలియజేశారు. అంటే పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అని ఖరారయినట్లేనని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story

