Sun Mar 08 2026 00:33:54 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ తొలిసారి చట్టసభలోకి ప్రవేశించి తొలి సారి మంత్రి అయ్యారు. ఇప్పటి వరకూ వెండి తెరపై ఏలిన పవన్ కల్యాణ్ ఇక ఏపీ రాజకీయాల్లోనూ తనదైన మార్క్ ను చూపెడతారని జనసైనికులు భావిస్తున్నారు.
పదేళ్ల రాజకీయకాలంలో...
పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అందరికీ నమస్కరిస్తూ తన సోదరుడు చిరంజీవికి వేదికపై పాదాభివందనం చేశారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ సరిగ్గా పదేళ్ల తర్వాత ఏపీ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన తొలి ఎన్నికలో పోటీ చేయలేదు. మలి ఎన్నికలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయినా మూడోదఫా పిఠాపురం నుంచి నెగ్గి మంత్రి పీఠాన్ని అధిరోహించారు.
Next Story

