Fri Mar 27 2026 10:31:59 GMT+0530 (India Standard Time)
ఎయిర్ పోర్టు ఘటన పై పవన్ వివరణ
నిన్నటి ఎయిర్ పోర్టు వద్ద జరిగిన దాడితో తమకు సంబంధం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు

నిన్నటి ఎయిర్ పోర్టు వద్ద జరిగిన దాడితో తమకు సంబంధం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఆయన ఈ విధంగా రాశారు. పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన మీడియా సమావేశంలో ఉండగానే పోలీసులు వచ్చినోటీసులు అందచేశారు.
నోటీసులు తీసుకున్న....
విశాఖలో 30 యాక్ట్ అమలులో ఉందని ఎలాంటి సమావేశాలు, సభలు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నోటీసులను పవన్ కల్యాణ్ అందుకున్నారు. జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారని తెలుస్తుంది.
Next Story

