Thu Mar 26 2026 03:04:20 GMT+0530 (India Standard Time)
బీజేపీతో పొత్తులోనే ఉన్నాం : పవన్
తాము భారతీయ జనతా పార్టీతో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని తెలిపారు

తాము భారతీయ జనతా పార్టీతో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని తెలిపారు. కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. 2014 కాంబినేషన్ పై కాలమే సమాధానం చెబుతుందన్నారు. బీజేపీతో ఇప్పుడు కలసి ఉన్నామని, ఎవరు కలసి వచ్చినా, రాకపోయినా ఎన్నికలకు వెళతామని తెలిపారు. పొత్తులపై ఇంకా సమయం ఉందన్నారు.
వారం రోజుల ముందే...
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి పొత్తుల గురించి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఆలోచించదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న లక్ష్యంతోనే తాము ఉన్నామని తెలిపారు. ఎన్నికలకు వారం రోజుల ముందే పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికల కూటమిపై బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీలో ప్రస్తుతం కలిసి ఉన్నామని, ముందు కూడా కలసే ఉంటామని తెలిపారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.
- Tags
- pawan kalyan
- bjp
Next Story

