Thu Dec 18 2025 17:50:45 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి పల్లకీనో మోయడానికి రాలేదు
2024 లో వైసీపీ ప్రభుత్వం రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు

2024 లో వైసీపీ ప్రభుత్వం రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాసిపెట్టుకోమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్లు చీలనివ్వకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని, ఆ మాటంటే వైసీపీ నేతలకు ఉలుకు ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాయలంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగించారు. గెలవని పార్టీ కోసం ఎవరూ తపన పడాల్సిన పనిలేదన్నారు.
శ్రీలంకలా......
వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, విధ్వంసాలతో పాతికేళ్లు రాష్ట్ర్రాన్ని వెనక్కు తీసుకెళ్లారన్నారు. వైసీపీకి వచ్చే ఎన్నికలలో ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. వైసీపీ నేతలు ఏపీని మరో శ్రీలంకలా తయారు చేస్తున్నారని చెప్పారు. అయితే తాను ఎవరి పల్లకీనో మోయనని, ప్రజలను పల్లకి ఎక్కించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెప్పరు. రైతులను ఆదుకునేందుకు జనసేన రైతు భరోసా కార్యక్రమం చేపడుతుందని పవన్ ప్రకటించారు.
Next Story

