Sat Dec 06 2025 02:12:34 GMT+0000 (Coordinated Universal Time)
అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోతున్నా
ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు హాజరు కాలేకపోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు

ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు హాజరు కాలేకపోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఆయన వీడ్కోలు సభకు హాజరు కాలేక పోతున్నట్లు పవన్ ప్రకటించారు. రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు హాజరు కావలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. వీడ్కోలు సభకు ఆహ్వానం తనకు అందిందని, ఆహ్వానించిన నరేంద్ర మోదీకి, అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కోవింద్ సేవలు....
చారిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తాను వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. అయిదేళ్ల కాలంలో ఎలాంటి పొరపొచ్చాలు లేకుంా రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించడం రామ్నాథ్ కోవింద్ రాజనీతిజ్ఞతకు నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన తన సేవలను అజరామరంగా నిర్వర్తించాలని, భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ తెలిపారు.
Next Story

