Sat Dec 06 2025 03:05:07 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీలో దాడులపై పవన్ రియాక్షన్
ఏపీ అసెంబ్లీలో దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు

అసెంబ్లీలో దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శానసభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే ఈ పరిణామాలు దురదృష్టకరమైనవని అన్నారు. ప్రజల గొంతునొక్కి జీవో నెంబరు 1పై చర్చను కోరిన బుచ్చయ్య చౌదరి, డోలి బాలవీరాంజనేయస్వామిపై అధికార పక్షం దాడ చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.
అర్ధవంతమైన చర్చల కోసం...
అర్థవంతమైన చర్యలు లేకుండా దాడులేమిటి? - చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని కోరారు. ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే పరిణామాలని అన్నారు. జీవో నం.1 పై చర్చకు అనుమతించకపోవడం దారుణమని అన్నారను. స్వామి, బుచ్చయ్యపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
Next Story

