Thu Mar 26 2026 23:26:47 GMT+0530 (India Standard Time)
నేనూ వివక్షకు గురయ్యా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివక్షకు గురయ్యాయని చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివక్షకు గురయ్యాయని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై జనసేన నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో తాను వివక్షకు గురయినట్లు పవన్ తెలిపారు. తనకు నీళ్లు ఇవ్వడానికి కూడా బ్రిటీష్ మహిళ నిరాకరించిందన్నారు. ప్రభుత్వం చేసిన చట్టాలను సక్రమంగా అమలు పరిస్తేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రధానితో ప్రజాసమస్యలపైనే మాట్లాడతానని తెలిపారు. తాను ఎవరితో ఉన్నానన్నది అనవరమని ఆయన అన్నారు. ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమన్నారు.
పదవిలో ఉన్నప్పుడు...
పదవిలో ఉన్నప్పుడు జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పలన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించారన్నారు. అలా మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీ ప్రయోజనాలకే వినియోగించాలని కోరారు. తాము అధికారంలోకి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు ఎలా చేయాలన్న దానిపై త్వరలోనే తాను ఒక సమగ్ర నివేదికను ప్రజల ముందు ఉంచుతానని పవన్ కల్యాణ్ తెలిపారు. వ్యక్తి ఆరాధన మంచిది కాదన్నారు. తాను తప్పు చేసినా నిలదీయాల్సిందేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ చేసింది.
Next Story

