Thu Mar 19 2026 05:26:53 GMT+0530 (India Standard Time)
Pawan : భారీ ర్యాలీతో బయలుదేరిన జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ కు బయలుదేరారు. మరికాసేట్లో పిఠాపురం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ కు బయలుదేరారు. భారీ ర్యాలీతో పవన్ కల్యాణ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వెళుతున్నారు. పవన్ నామినేషన్ కు ముందు జరిగిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు పార్టీ కార్యకర్తలు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
నామినేషన్ వేసేందుకు...
పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి పవన్ నేడు నామినేషన్ వేయనున్నారు. తన నివాసం నుంచి అట్టహాసంగా బయలుదేరిన పవన్ కు అభిమానులు వెంట నడిచారు. చేబ్రోలు నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం వరకూ ఈ ర్యాలీ జరగనుంది. పవన్ నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత జరిగే సభలో ప్రసంగించనున్నారు.
Next Story

