Wed Jan 22 2025 14:26:58 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ఇంటింటికీ తిరుగుతూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఇంటింటికీ తిరిగి గ్రామస్థులను పలకరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు.
పొన్నాడ గ్రామంలో...
నాలుగో రోజు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పొన్నాడ గ్రామం, మూలపేటలో వారాహి విజయ యాత్రలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ అక్కడి ప్రజలు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. పొన్నాడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వాళ్ళను పలకరిస్తున్నారు. పవన్ తమ ఇంటికి రావడంతో గ్రామస్థులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
Next Story