Thu Mar 19 2026 10:28:19 GMT+0530 (India Standard Time)
నేడు భీమవరంలో పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భీమవరం రానున్నారు. ఈరోజు భీమవరంలో జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భీమవరం రానున్నారు. ఈరోజు భీమవరంలో జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం పది గంటల నుంచి భీమవరంలోని ఆనంద ఇన్ కల్యాణ మండపలంలో జనవాణి కార్యక్రమం జరగనుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు జనవాణి కార్యక్రమానికి హాజరై పవన్ కల్యాణ్ కు తమ సమస్యలను వివరించవచ్చు.
జనవాణి కార్యక్రమానికి...
పవన్ కల్యాణ్ ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు భీమవరంలో నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. అక్కడికి వస్తుండటంతో పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలకనునున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన తర్వాత సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.
Next Story

