Wed Mar 18 2026 16:45:29 GMT+0530 (India Standard Time)
పవన్ కు బదులు నాదెండ్ల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని నిత్యం విమర్శలు చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరదలు తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవడం లేదని చెబుతున్న పవన్ కల్యాణ్ తన ప్రతినిధిగా నాదెండ్ల మనోహర్ ను వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు పంపారు.
జనసేన ఆధ్వర్యంలో...
పవన్ కల్యాణ్ కు బదులుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులకు జనసేన పార్టీ తరుపున నిత్యావసరాలు, బట్టలు పంపిణీ చేశారు. జగన్ ను వర్క్ ఫ్రం హోం సీఎంగా నాదెండ్ల మనోహర్ విమర్శిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటించకుండా ఎక్కడకు వెళ్లారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Next Story

