Tue Mar 17 2026 02:13:50 GMT+0530 (India Standard Time)
భారీ ర్యాలీలో పవన్
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ వరకూ ఆయన ప్రదర్శనగా బయలుదేరారు

విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ వరకూ ఆయన ప్రదర్శనగా బయలుదేరారు. జనసేన కార్యకర్తలు వేలాది మంది పవన్ కు స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది.
జనసైనికుల భారీ స్వాగతం...
కారు టాపు పైకి ఎక్కి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ అందరిలోనూ ఉత్సాహం నింపారు. చాలా రోజుల తర్వాత పవన్ విశాఖకు రావడంతో ఆయనకు పెద్దయెత్తున జనసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన మూడు రోజుల పాటు విశాఖలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Next Story

