Sat Mar 07 2026 19:36:25 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వానికి పవన్ వార్నింగ్
రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తే చూస్తు ఊరుకునేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలోని ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకూ తాము పోరాడతామని తెలిపారు. చేతికొచ్చిన పంట వర్షాలపాలయిందన్నారు. ఒత్తిడి ఉంటే తప్ప ఈ ప్రభుత్వం దిగిరావడం లేదన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. తనకు సమస్యలు చెప్పుకున్న రైతులను ప్రభుత్వం వేధించినా, కేసులు పెట్టినా వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు.
రైతులను వేధిస్తే...
రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. తానే స్వయంగా వచ్చి రైతుల సమస్యలను వినడానికి ఈ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం మంచిది కాదన్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకూ పోరాటం ఆగదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story

