Sat Mar 28 2026 09:37:45 GMT+0530 (India Standard Time)
ప్రజలను ఇంతకాలం మభ్యపెట్టినట్లే
మూడు రాజధానుల బిల్లు రద్దు పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

మూడు రాజధానుల బిల్లు రద్దు పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. న్యాయస్థానాల్లో కేసులు వీగిపోతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. మూడు రాజధానులంటూ మభ్య పెట్టి అభివృద్ధి జరగకుండా చేశారాన్నారు. మరోసారి మూడు రాజధానులు బిల్లును రద్దు చేస్తున్నామని చెప్పి, కొత్త బిల్లులు తెస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
కోర్టులో ఓటమి తప్పదని...
హైకోర్టులో ఓటమి తప్పదని గ్రహించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని పవన్ చెప్పారు. ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమని, ఇప్పటికైనా జగన్ గ్రహించి అమరావతి నిర్మాణానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.
Next Story

