Fri Dec 05 2025 14:00:21 GMT+0000 (Coordinated Universal Time)
Pawan : అందుకే టీడీపీతో కలిశాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన పొత్తుపై మరోసారి స్పందించారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన పొత్తుపై మరోసారి స్పందించారు. రాష్ట్రానికి బలమైన నాయకత్వం ఇవ్వాలనే టీడీపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉన్నందు వల్లనే టీడీపీతో కలసి పనిచేయాలని నిర్ణయించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
నిర్లక్ష్యం వద్దు...
వచ్చే ఎన్నికల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దని నేతలకు సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రత్యర్థికి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పోవాలి, జనసేన - టీడీపీ రావాలి అని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి పదవి కంటే రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమనేది తన భావన అని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిద్దామని, కానీ దాని కంటే రాష్ట్రం ముఖ్యమని పవన్ వ్యాఖ్యానించారు.
Next Story

