Sat Mar 28 2026 08:07:42 GMT+0530 (India Standard Time)
సింగిల్ డెసిషన్ కాదు అది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై కొంత స్పష్టత ఇచ్చారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై కొంత స్పష్టత ఇచ్చారు. పొత్తుల గురించి కొందరు మాట్లాడుతున్నారని, కానీ తాము ఇప్పటికే బీజేపీతో పొత్తుతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తుల నిర్ణయం ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. రకరకాల పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చని, అందులో తప్పేమీ లేదని అన్నారు. అయితే ప్రస్తుతం పొత్తుల కొంటే పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతంపై.....
పొత్తులపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సింగిల్ గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదని స్పష్గం చేశారు. పార్టీలు ఆడే మైండ్ గేమ్ లో పావులుగా మారొద్దని పవన్ కల్యాణ్ క్యాడర్ కు తెలిపారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై అందరూ దృష్టి పెట్టాలని పవన్ కోరారు.
Next Story

