Sat Mar 28 2026 06:38:11 GMT+0530 (India Standard Time)
ఇతర రాష్ట్రాలను చూసైనా నేర్చుకోండి
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతుంటే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. అదే సమయంలో వైన్ షాపుల సమయాన్ని మాత్రం పెంచిందని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలను చూసైనా నేర్చుకోవాలని ఆయన సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
త్వరగా కోలుకోవాలి....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఆయన కరోనా బారిన పడటం విచారకరమని, త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకి ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Next Story

