Fri Dec 05 2025 19:56:36 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనానికి వైరల్ ఫీవర్.. జనవాణి వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్ సోకింది. తూర్పు గోదావరి జల్లా పర్యటన తర్వాత ఆయనకు వైరల్ ఫీవర్ సోకింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్ సోకింది. తూర్పు గోదావరి జల్లా పర్యటన తర్వాత ఆయనకు వైరల్ ఫీవర్ సోకింది. దీంతో ఈ నెల 24వ తేదీన ఆదివారం జరిగే జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక వారం మాత్రమే జనవాణి వాయిదా పడిందని, ఈ నెల 31వ తేదీన తిరిగి ఎప్పటిలాగే జనవాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
సెక్యూరిటీ సిబ్బందికి కూడా...
31వ తేదీన జనవాణి కార్యక్రమం ఎక్కడ జరుగుతుందన్నది త్వరలో వివరాలు వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది, ప్రోగ్రాం కమీట ీ సభ్యులు కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. దీంతో ఒక వారం జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటి వరకూ విజయవాడలో రెండు దఫాలు, భీమవరంలో ఒకదఫా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి రాయలసీమ జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అది వాయిదా పడింది. ఈ నెల 31వ తేదన తిరిగి జనవాణి కార్కక్రమం జరుగుతుందని నాదెండ్ల తెలిపారు.
Next Story

