Thu Mar 19 2026 07:06:18 GMT+0530 (India Standard Time)
Breaking : మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి బాలశౌరి పేరును ఖరారు చేశారు. తొలి నుంచి ఆయన పేరే వినిపించినా ఇప్పటి వరకూ ప్రకటన రాకపోవడంతో మరికొందరి పేర్లు వినిపించాయి. విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరు ప్రకటించినా అక్కడ పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆ సీటుపై కొంత కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే చివరకు వంశీ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు...
ఇక కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ జనసేన తరుపున పోటీ చేయడానికి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో అవనిగడ్డలో ఐవీఆర్ఎస్ సర్వేలను పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ లో ఇద్దరు ముగ్గురు పేర్లను పవన్ పరిశీలిస్తున్నారు. అలాగే పాలకొండ అభ్యర్థిని కూడా ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ కూడా కొందరు నేతలు పోటీ పడుతుండటంతో ఈ స్థానంలో అభ్యర్థి ఎంపికను కూడా పవన్ కల్యాణ్ పెండింగ్ లో పెట్టారు.
Next Story

