Sat Mar 28 2026 09:36:13 GMT+0530 (India Standard Time)
జనసైనికులకు పవన్ పిలుపు ఇదే
వరద ప్రాంత పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చించారు.

వరద ప్రాంత పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చించారు. కొద్ది సేపటి క్రితం ఆయన జనసేన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల నేతలతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు.
సహాయక చర్యలలో....
వరద సహాయక చర్యలలో జనసైనికులు పాల్గొనాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు, క్యాడర్ కు పిలుపు నిచ్చారు. ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు చేపట్టడం లేదని అభిప్రాయపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థ ఎన్నిలప్పుడు మాత్రమే పనిచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్లు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
Next Story

