Thu Jan 29 2026 04:08:06 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను ఊపిరయినా తీసుకోనిస్తారా? పవన్ ట్వీట్
వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు

వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను రాష్ట్ర పర్యటనకు సిద్ధం చేసుకున్న వాహనం రంగుపై వైసీపీ నేతలు విమ్శలు చేస్తున్నారని ఆయన సెటైర్ వేశారు. "తొలుత నా సినిమాలను అడ్డుకున్నారు. తర్వాత విశాఖపట్నం పర్యటనకు వెళితే హోటల్ గది నుంచి బయటకు రానివ్వ లేదు. మంగళగిరిలో పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా నా వాహనాన్ని అడ్డుకున్నారు. కనీసం నడిచి వెళదామన్నా వెళ్లనివ్వలేదు. ఇప్పుడు వాహన రంగు సమస్యగా మారింది. తర్వత నన్ను ఊపిరి కూడా తీసుకోవద్దంటారా?" అంటూ ఆయన ట్వీట్ చేశారు. కనీసం ఈ షర్ట్ అయినా నన్ను వేసుకోనిస్తారా? అని ప్రశ్నించారు.
వాహనం రంగుపై...
పవన్ కల్యాణ్ తన రాష్ట్ర పర్యటన కోసం తయారు చేయించిన వాహనం రంగుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేశారు. పసుపు రంగు వేసుకోవాలని కొందరు సూచించారు. అయితే ఆర్మీ రంగుపోలి ఉన్న వాహనం కావడంతో నిబంధనలను అంగీకరించవని కొందరు పేర్కొన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. చివరకు ఈ వైసీపీ నేతలు తనను ఊపిరి పీల్చుకోవడానికి కూడా అభ్యంతరం పెట్టేటట్లుంది అన్న రీతిలో ట్వీట్ చేశారు.
Next Story

