Sat Dec 07 2024 22:58:33 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లకు ఆ పాపాన్ని అంటగట్టిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమంటూ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాలంటీర్ల వ్యవస్థకు ముందు నుండి వ్యతిరేకంగా తన వాయిస్ ను వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమని.. ఆ విషయాన్ని ఇంటెలిజెన్స్ కూడా తనకు చెప్పిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
గ్రామాల్లో ఉండే వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు..? ఆడపిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా ? వారిలో వితంతువులు ఉన్నారా అనే విషయాలను సేకరించి వాలంటీర్లు సమాచారాన్ని సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇదే విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయన్నారు పవన్ కల్యాణ్. దీని వెనుక వైపీసీ పెద్దల హస్తం కూడా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేసుంటే బాగుండేదని.. అలాకాకుండా వాలంటీర్లపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జనసేనానికి తగదని అన్నారు. హ్యమన్ ట్రాఫికింగ్ పనులు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Next Story