Thu Mar 19 2026 05:04:10 GMT+0530 (India Standard Time)
జనసేన ప్రభుత్వం రాగానే వాటిని కూల్చేస్తాం: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్ చేశారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన అక్రమ నిర్మాణాల్లో ఎవరూ పెట్టుబడులు పెట్టకండని.. ఫ్లాట్స్ కొనకండని చెప్పారు. జనసేన ప్రభుత్వం రాగానే వాటిని కూల్చేస్తామని హెచ్చరించారు. గుర్గావ్ లో నీకు చెందిన 36 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన విషయం గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎంపీ ఎంవీవీ 4 అంతస్తులకు అనుమతి తీసుకుని 26 అంతస్తులు కడుతున్నాడని ఆరోపించారు. విశాఖ ఎంపీగా మీరు గెలిపించిన ఎంవీవీ సత్యనారాయణ ఒక రౌడీషీటర్. అతను కనీసం పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేకపోయాడన్నారు. ఒక రౌడీషీటర్ ను ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ భూములు దోచుకుంటున్నాడని.. కేసులు ఉన్నవారికి, గూండాలకు, దోపిడీదారులకు ప్రధానిని అడిగే దమ్ము లేదని అన్నారు పవన్ కళ్యాణ్.
జగన్ ఒక దుర్మార్గుడని, ఓట్లు చీలకూడదు అనడానికి కారణం అలాంటివాడు మరోసారి సీఎంగా అవ్వకూడదనే అని గాజువాకలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావు జగన్? ఏ కష్టం చేయకుండా ప్రజల ఆస్తులు దోచుకుంటున్నావని ఆరోపించారు. దేవుడు అని భుజాన ఎక్కించుకుని జగన్ ను గెలిపిస్తే, దెయ్యమై ఊరి మీద పడి దోచుకుంటున్నాడని పవన్ నిప్పులు చెరిగారు. కోటి మంది ప్రజలు వచ్చి నిన్ను చుట్టుముడితే ఎక్కడికి పోతావ్ జగన్? అంటూ నిలదీశారు. ఎంతమంది పోలీసులను అడ్డుపెట్టుకుంటావ్? ప్రజలు నిన్ను ముట్టడించే రోజు వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నేను పని చేసుకుంటూ వెళుతున్నాను, మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిని అవుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. పదేళ్లుగా ప్రజల మధ్యలో ఉన్నాను, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Next Story

